ఆర్మూర్/ నందిపేట్/మాక్లూర్/మెండోరా, నవంబర్ 10: ఆర్మూర్ మండలం ఫత్తేపూర్, చేపూర్ గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కల్యాణలక్ష్మి చెక్కులను సర్పంచులు కొత్తపల్లి లక్ష్మీ లింబాద్రి, ఇందూర్ సాయన్న, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో పార్టీ గ్రామాల అధ్యక్షులు రిక్కల రాజారెడ్డి, వజ్రంరెడ్డి, నాయకులు గంగారెడ్డి, రాములు, రాజేశ్వర్ పాల్గొన్నారు.
నందిపేట్ మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు గురువారం అందజేశారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు భాస్కర్, ఉపసర్పంచ్ భరత్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మాక్లూర్ మండలంలోని వల్లభాపూర్, చిక్లీ, దుర్గానగర్, దుర్గానగర్ కింది తండా తదితర గ్రామాల్లో తదితర గ్రామాల్లో సర్పంచులు, పార్టీ నాయకులు సీఎం ఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచులు మంజుల, పద్మావతి, పార్టీ నాయకులు సుధాకర్, రాజేశ్వర్, శ్రీకాంత్, రాంసింగ్ నాయక్ పాల్గొన్నారు.
మెండోరా మండల కేంద్రంలో 8 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను డీసీసీబీ డైరెక్టర్, పార్టీ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్‌రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బూరుకల సుకన్యా కమలాకర్, జడ్పీటీసీ తలారి గంగాధర్, సర్పంచులు మచ్చర్ల రాజారెడ్డి, మిస్బా, శ్రీనివాస్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ తదితరులు పాల్గొన్నారు.