సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. అతివల సందడితో ఊరూవాడ ‘పూల’కించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురాల్లో మగువలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో పల్లెలన్నీ పూల వనాన్ని తలపించాయి. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు.
బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. కలవారి కోడలు ఉయ్యాలో.. గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ ఊరూవాడా మార్మోగింది. తొమ్మిది రోజులపాటు పూజలందుకున్న బతుకమ్మ సోమవారం గంగమ్మ ఒ డికి చేరింది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. పల్లెలన్నీ పూలవనాన్ని తలపించాయి. గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలు పాడారు. యువతులు, పిల్లలు దాండియా, కోలాటాలు ఆడారు. అనంతరం శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. మహిళలు ఒకరికొకరు వాయినం ఇచ్చిపుచ్చుకున్నారు. మహిళలు వెంట తెచ్చుకున్న సద్దులను ఆరగించారు.