రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ హైదరాబాద్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ సహకారంతో ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించి లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని బాజిరెడ్డి పేర్కొన్నారు.