భీమ్‌గల్/మోర్తాడ్/వేల్పూర్, జనవరి 30: మోర్తాడ్ మండలంలో పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ఆదివారం బాధితులకు అందజేశారు. మంజులకు రూ.75వేలు, వినోదకు రూ.30వేలు, షేక్ఇక్బాల్కు రూ.70వేలు, చిన్నుబాయికి రూ.25వేలు, గంగాధర్‌కు రూ.33 వేలు, లక్ష్మికి రూ.40వేల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరవగా.. బాధితులకు ఎంపీపీ వాటిని అందజేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కో- ఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు జేసీ గంగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్వర్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేశ్, నాయకులు గంగామోహన్, పూర్ణచందర్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. భీమ్‌గల్ మండలంలోని గోన్‌గొప్పులకు చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్ అవుసుల అనసూయ లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఉపసర్పంచ్ ఆశ్విని, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు భూమేశ్వర్, నాయకులు నరేశ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో 13 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్, 16 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. నాయబ్ తహసీల్దార్ రాజశేఖర్, సర్పంచ్, ఉపసర్పంచులు తీగల రాధ, పిట్ల సత్యం, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, ఆత్మ కమిటీ చైర్మన్ నోముల రవీందర్, పార్టీ వేల్పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు బబ్బురు ప్రతాప్, నాయకులు భీమ ప్రసాద్, భోజన్న యాదవ్, సాకలి దేవేందర్, నందిపేట్ ప్రవీణ్, చిన్నారెడ్డి, కుమ్మరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.