కామారెడ్డి, మే 27: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం లో దళితబంధు లబ్ధిదారులకు విప్ గంపగోవర్ధన్ శుక్రవారం వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధులాంటి పథకం దేశం లో మరెక్కడా లేదన్నారు. దళితులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బడు గు, బలహీనవర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఆర్థిక అసమానతలు రూపుమాపడం కోసమే దళితబంధు పథకం అమలు చేస్తున్నామన్నారు.
దళితులు తాము తీసుకున్న యూనిట్ల ద్వారా వ్యాపార లబ్ధి పొందుతూ ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, భిక్కనూర్ మండలాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. కార్యక్రమంలో మాచారెడ్డి, భిక్కనూర్ ఎంపీపీలు నర్సింగ్ రావు, గాల్ రెడ్డి, కామారెడ్డి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కుంబాల రవి యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దయానంద్ , కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, టీఆర్ఎస్ భిక్కనూర్ మండల అధ్యక్షుడు బిక్క నర్సింహారెడ్డి, సిద్ధరామేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి బల్వంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.