వినాయక్‌నగర్, అక్టోబర్ 6: నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి డీజే నిర్వాహకులు ఈ నెల 30లోగా లైసెన్సు, పర్మిషన్ తీసుకోవాలని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ స్పష్టం చేశారు. ఇతర రా ష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చే డీజేలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఆదివారం డీజే షాపుల యాజమాన్యాలు ఆదివారం సీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డీజే నిర్వాహకులు పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ ప్రజలు, సీనియర్ సిటిజన్స్, చిన్న పిల్లలకు ఇబ్బందులు కలుగకుండా చట్ట పరిధిలో రెండు సౌండ్ బాక్స్‌లు వాడుతూ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి తీసుకువచ్చే డీజేలను పూర్తిగా నిషేధించినట్లు చెప్పారు. ఒకవేళ వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.