ఎల్లారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నివాసి జమీల్‌కు (Jameel ) ఆదివారం జాతీయ సేవా పురస్కారాన్ని (National service award ) అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిలకలూరిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్లారెడ్డి వాసి, ఉపాధ్యాయుడు, కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్‌కు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అవార్డును అందజేసి సన్మానించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ( MLA Pattipati Pullarao) , ఆంధ్ర ప్రదేశ్ పర్యావరణ నిర్వాహణ కార్పొరేషన్ చైర్మన్ పొలం రెడ్డి దినేష్ రెడ్డి జాతీయ సేవా పురస్కారాన్ని అందజేశారు
. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వ్యక్తిగతంగా 27సార్లు రక్తదానం (Blood Donation) చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితులలో ఉన్నవారికి సకాలంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్న జమీల్‌ను వారు అభినందించారు. ఇంతటి అవకాశం రావడానికి కారణమైన కామారెడ్డి రక్తదాతల సమూహానికి అవార్డు గ్రహిత కృతజ్ఞతలు తెలిపారు.