ఖలీల్‌వాడి, మార్చి 6: ఇందూరు నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరిస్తున్నది. స్థిరాస్తి రంగంలో దూసుకుపోతున్నది. వెంచర్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, ఆధునాతన భవంతులతో ఇందూరు మెట్రో సిటీని తలపిస్తున్నది. ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన రవాణా వ్యవస్థతోపాటు పర్యాటక, వాణిజ్య రంగాల్లో రాణిస్తున్నది. మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా ప్రసిద్ధిగాంచడంతో ఇక్కడ నివసించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో నగరంలో రియల్ వ్యాపారానికి డిమాండ్ ఏర్పడింది. నగరశివారుతోపాటు నుడా పరిధిలోని గ్రామాల్లోనూ పెద్ద సంఖ్యలో వెంచర్లు వెలుస్తున్నాయి. ఇక్కడున్న డిమాండ్‌ను చూసి నిజామాబాద్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన పలు కార్పొరేట్ రియల్ ఎస్టేల్ సంస్థలు సైతం వెంచర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకురావడం గమనార్హం. జీవన శైలిలో మార్పు కోసం కొత్త వెంచర్లు, విల్లాలు, అపార్టుమెంట్లతోపాటు అత్యాధునిక సదుపాయాలను ప్రజలు కోరుకుంటున్నారు.
జీవనప్రమాణాల్లో మెరుగైన స్థానం సంపాదించుకున్న ఇందూరు నగరంలో ఫ్లాట్, ఇల్లు, అపార్ట్మెంట్, ప్లాట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలకు నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను ఏర్పాటు చేస్తున్నది. ఈ నెల 8,9వ తేదీల్లో హైదరాబాద్ రోడ్లో ఉన్న వేణుమాల్ (హోటల్ నిఖిల్‌సాయి)లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించనున్నది. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ సంస్థల చుట్టూ తిరగకుండా ఒకే వేదిక పైకి ప్రముఖ సంస్థలను తీసుకువస్తున్నది. రుణ సౌకర్యం సైతం కల్పించేందుకు బ్యాంకు స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నది. ప్రజలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నది.
మెయిన్ స్పాన్సర్ వాసవి గ్రూప్స్, కో -స్పాన్సర్ శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్(ఎస్వీసీ), మకుట బిల్డర్స్ (క్రౌన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్), అసోసియేషన్ విత్ : శ్రీ అశోకా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ఐశ్వర్యం హోమ్స్, రాయల్ ఓక్ నిజామాబాద్, బాలాజీ డివైన్, ఏపీడీ డెవలపర్స్, శ్రీ గోవిందసాయి బిల్డర్స్ అండ్ డెవలపర్స్, శ్రీ ఎస్ఎల్ ఎన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, అంకురమ్, భూమి స్పేస్, సన్యుగ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ నార్త్ క్రెస్ట్, మయూర సూపర్ లివింగ్, ఆదూరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కపిల్ ప్రాపర్టీస్, టీఎంఆర్ గ్రూప్, అక్షయ ఎంటర్ ప్రైజెస్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.