Nizamabad | కంటేశ్వర్, జూన్ 17 : నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ సిబ్బంది జవాన్ కుమార్, చిత్త సేకరణ ట్రాక్టర్ డ్రైవర్ ఇమామ్ మానవత్వం చాటుకున్నారు. నగరంలోన 24వ డివిజన్లో ఉదయం సాధారణంగా చెత్తను ట్రాక్టర్లోకి లోడ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ఇమామ్, జవాన్ కుమార్‌లకు చెత్తలో మంగళవారం రెండు తులాల బంగారు గొలుసు కనిపించింది. ఈ సందర్భంగా వారిద్దరూ బంగారు గొలుసు గాయత్రి నగర్‌కు చెందిన పద్మ గౌడ్ అనే మహిళ దిగా నిర్ధారించుకున్నారు.
దీంతో చెత్తలో దొరికిన రూ.2 లక్షల విలువైన బంగారు గొలుసు ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఇమామ్, జవాన్ కుమార్ల నిజాయితీకి కమిషనర్ అభినందనలు తెలుపుతూ వారికి సన్మానం చేశారు. ప్రజలు చెత్త సేకరణకు పని చేసే కార్మికులను నిర్లక్ష్యంగా చూడకూడదని, వారు ఎంతో జవాబుదారీగా, మానవత్వంతో పనిచేస్తున్నారని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిజాయతీ చాటుకున్న మున్సిపల్ సిబ్బందిని పలువురు అభినందించారు.