కామారెడ్డి : పట్టణ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది నిజాయితీగా పనిచేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ( MLA Ramana Reddy ) కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల ఉద్యోగులు, కార్మికులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కొంత మంది మున్సిపల్ సిబ్బంది రాజకీయ నాయకులు, అధికారుల ఇళ్లల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు.
మరికొంత మంది పనిచేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగులు తమ పనినీరును మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.