లింగంపేట(తాడ్వాయి), మార్చి 30: తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామ రహదారి సమీపంలో ఆటో బోల్తా పడి తల్లి, కుమారుడు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. లింగంపేట మండలం బాణాపూర్ గ్రామానికి చెందిన డప్పు సాయిలు కుటుంబ సభ్యులు ముత్యంపేటలో జరిగే శుభకార్యానికి సోమవారం ఆటోలో బయల్దేరా రు. అయితే, ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో డప్పు సాయిలు, అనంతయ్య, రమేశ్, రామవ్వ, సాయవ్వ, రాజవ్వ, బాలమణి, మల్కవ్వ, నాగమణి, లక్ష్మి, మరియ మ్మ, పోశవ్వతో పాటు ఆటో డ్రైవర్ ముంబాజీపేట సాయిలు గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొం దుతూ సాయిలు కన్నుమూశాడు. మరోవైపు, తీవ్రంగా గాయపడిన పోశమ్మను మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.