మద్నూర్, ఆగస్టు 30: మహారాష్ట్రలోని ముఖేడ్ వద్ద 35 ఏండ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన మండలకేంద్రం నుంచి ప్రత్యేక బస్సులో నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులతో కలిసి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.
అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం.. మహారాష్ట్ర ప్రభుత్వంతో లెండి ప్రాజెక్టు నిర్మాణంపై చర్చలు జరుపుతున్నదని తెలిపారు. ప్రాజెక్టును పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పూర్తయితే జుక్కల్ నియోజకవర్గ పరిధిలో 22 వేల ఎకరాల వరకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు.