దొంగలకు తావివ్వని ‘బాన్సువాడ’
బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శవంతమైనదని, దొంగలకు తావివ్వదని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా బాన్సువాడకు వచ్చిన కాసుల బాల్‌రాజ్‌ను సోమవారం స్థానిక ఫంక్షన్హాల్లో ఘనంగా సత్కరించారు.
- బాల్‌రాజ్‌కు పదవి వస్తే రాద్ధాంతం చేసిండ్రు
- బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, జూలై 15: బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శవంతమైనదని, దొంగలకు తావివ్వదని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా బాన్సువాడకు వచ్చిన కాసుల బాల్‌రాజ్‌ను సోమవారం స్థానిక ఫంక్షన్హాల్లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఇప్పటివరకు బాన్సువాడకు చెందిన నాయకులకు ఎవరికీ రాష్ట్ర పదవి రాలేదని, కాసుల బాల్‌రాజ్‌కు వస్తే గిట్టక కొంత మంది ఆధిష్టానం వద్దకు వెళ్లి రాద్ధాంతం చేశారని విమర్శించారు. స్థానికంగా ఉన్న వారికి పదవి వస్తే సంతోషించాలని, కానీ అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అద్దెకు వచ్చిన వాళ్లు కుటిలబుద్ధితో తాను కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకించారు తప్పితే స్థానిక కార్యకర్తలు కాదన్నారు.
దోచుకునేందుకే వచ్చిండు..
ఎల్లారెడ్డిలో అమ్ముడుపోని సరుకు ఇక్కడ అమ్ముడుపోతుందా? అని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ బాల్‌రాజ్ ప్రశ్నించారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఇసుక అనే నిధి ఉందని, దాన్ని దోచుకోవడానికే వచ్చిండు అని మండిపడ్డారు. ఎల్లారెడ్డిలో ఏమీ చేయని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు.. ఆయన దుకాణం ఇక బంద్ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ లోకల్.. పక్కా లోకల్ అని స్పష్టం చేశారు. ఇక నుంచి నియోజకవర్గ ఇన్చార్జి అనేది ఉండదని, ఎమ్మెల్యేనే ఫైనల్ అన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

