రెంజల్ : నిజామాబాద్ ( Nizamabad ) జిల్లా రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామానికి చెందిన దండగుల భువనేశ్వరి (40)అనే వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ( Suicide ) పాల్పడింది. కొనఊపిరితో ఉన్న ఆమెను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని రెంజల్ ఎస్సై కె చంద్రమోహన్( SI Chandra Mohan ) తెలిపారు.
కొంతకాలంగా అనారోగ్యంతో మానసికంగా బాధపడుతుందని, దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లోని బాత్రూం లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. భర్త శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బోధన్ జిల్లా ప్రభుత్వ దవఖానకు తరలించామని ఎస్సై వెల్లడించారు.