నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 19 : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మాల మహానాడు నేతలను పోలీసులు గురువారం నిర్బంధించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ చలో అసెంబ్లీ ముట్టడికి మాల సంఘం నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు.
జిల్లాలోని బోధన్, నందిపేట్, మాక్లూర్, ఆర్మూర్, రుద్రూర్, డిచ్పల్లి, జక్రాన్పల్లి, పొతంగల్ తదితర మండలాల్లో తెల్లవారుజామునే ముఖ్య నాయకుల ఇండ్లకు వెళ్లి ఠాణాలకు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మాలలు ఐక్యంగా ఓట్లు వేసి గెలిపిస్తే, ఇలా అన్యాయం చేయడం సరికాదని మాల మహానాడు నేతలు మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు.