సుభాష్‌నగర్, జూలై 12: జిల్లా కేంద్రంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. నీల కంఠేశ్వరాలయం నుంచి రథయాత్రను ప్రారంభించి.. ప్రధానమార్గాల గుండా వినాయక్‌నగర్‌లోని విజయలక్ష్మీ గార్డెన్స్ వరకు కొనసాగింది. ప్రత్యేక పూజల అనంతరం మహాహారతి, ప్రసాద వితరణ చేశారు. శోభాయాత్రలో మహిళలు, భక్తులు నృత్యాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగర పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇస్కాన్ అబిడ్స్ అధ్యక్షుడు వేదాంత చైతన్య దాస్ ప్రభు హాజరై భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.