ఆర్మూర్, జనవరి8: ఆర్మూర్ క్షత్రియ సంఘం నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నిక కాగా ఆదివారం పట్టణంలోని గోల్‌బంగ్లా సాహస్రార్జున మందిరంలో కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా మధన్మోహన్, ప్రధాన కార్యదర్శిగా గంగామోహన్తోపాటు కార్యవర్గ సభ్యులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు.
జీవన్‌రెడ్డి దంపతుల పూజలు
పట్టణంలోని 7వ వార్డులో ప్రవాస గురడిరెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆయన సతీమణి రజితారెడ్డి హాజరై పూజలు నిర్వహించారు.
పద్మశాలీ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ
ఆర్మూర్ మండల పద్మశాలీ సంఘ క్యాలెండర్‌ను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం ప్రతినిధులు సీఏ రాజశేఖర్, విజయ్‌కుమార్, సంతోష్, ఆత్మచరణ్, ఎంపీపీ పస్క నర్సయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నూ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, పండిత్ పవన్, ఖాందేశ్ శ్రీనివాస్, సదాశివ్, మహేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రామకృష్ణ, రవి, శ్యామ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.