శక్కర్‌నగర్ : బోధన్ పట్టణం బీటీ నగర్‌లోని శ్రీ కోట మైసమ్మ సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి (Srilakshmi Narasimhaswamy) ఆలయంలో రెండు రోజులపాటు వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపకుడు పసుపులేటి గోపి కిషన్ తెలిపారు. ఈనెల 4వ తేదీన వేద పండితులతో సుదర్శన యాగం ( Sudarsana Yagam ) నిర్వహించనున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమాలకు మల్లారం లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని వివరించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ, మరుసటి సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. రెండు రోజులపాటు నిర్వహించే కార్యక్రమాలకు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ విట్టల్, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ వెంకట నారాయణతో పాటు పట్టణంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లు గోపికిషన్ పేర్కొన్నారు.