రుద్రూర్, అక్టోబర్ 25 : సీఎం సహకారంతో డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజక వర్గం దేశానికే ఆదర్శంగా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రుద్రూ ర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో మంగళవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులను పంపిణీ చేశారు. మండలం లో దాదాపు 830 మందికి బిల్లులు చెల్లించనున్న ట్లు తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు రూ.120 కోట్లు వెచ్చించి 10వేల ఇండ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేద సొంతింటి కలను సాకారం చేసే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించిందన్నారు.
నియోజక వర్గానికి మరో 5 వేల ఇండ్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తున్నానని తెలిపారు. త్వరలో రూ.3లక్షలతో ఒక బెడ్రూం, బాత్రూం, కిచెన్, హాలు నిర్మించుకునే విధంగా కొత్త పథకం వస్తుందని.. లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా డబ్బులు జమ అవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ సుజాతా నాగేందర్, జడ్పీటీసీ నారోజి గంగారాం, వైస్ ఎంపీపీ సాయి లు, ఏఈ నాగేశ్వర్రావు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు లక్ష్మణ్, విండో మాజీ అధ్యక్షు డు రాము, ఏసీపీ కిరణ్‌కుమార్, కోఆప్షన్ సభ్యుడు మస్తాన్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సంగయ్య, ఎంపీటీసీలు, సర్పంచులుపాల్గొన్నారు.
యాసంగికి పుష్కలంగా సాగునీరు
యాసంగి పంటలకు పుష్కలంగా నీరుందని రైతు లు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పీకర్ తెలి పారు. తొందరపడి ధాన్యాన్ని దళారుల పాలు చేయవద్దని.. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.