ఎల్లారెడ్డి రూరల్ : ప్రజలు ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నేత్ర వైద్య సహాయ అధికారి హరికిషన్ రావు (Hari Kisan Rao) కోరారు. ఎల్లారెడ్డిలో ( Yellareddy) జిల్లా అంధత్వ నివారణ సంస్థ, లయన్స్ కంటి ఆసుపత్రి ( Lions Eye Hospital ) బాన్సువాడ ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డి సీహెచ్సీలో ఉచిత మోతిబిందు (Cataract diagnosis) నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గురువారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈరోజు నిర్వహించిన శిబిరంలో 51 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 6 గురికి మోతీ బిందు ఉన్నట్లు గుర్తించి వారికి కంటి ఆపరేషన్ కోసం బాన్సువాడ లయన్స్ కంటి ఆసుపత్రికి పంపామన్నారు.
18 మందికి దృష్టిలోపాలు ఉన్నట్లు గుర్తించి కంటి అద్దాలను సిఫారసు చేశామన్నారు. ఇద్దరికి తెల్లపువ్వు ఉన్నట్లు గుర్తించి చికిత్స కోసం హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి (Sarojini Eye Hospital) పంపామన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్, డాక్టర్ శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.