అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలి..

కామారెడ్డి టౌన్ : అటవీ, రెవెన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం రెవెన్యూ, ఫారెస్టు భూ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు భూములకు బౌండరీ ఏర్పాటు చేయాలని సూచించారు. ధరణిలో పెండింగ్ లేకుండా చూసుకోవాలని కోరారు. మినీ బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం బీర్కూర్ , దోమకొండ, నస్రుల్లాబాద్‌లో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాల చుట్టూ గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డీఎఫ్‌వో నిఖిత, ఆర్డీవో రాజాగౌడ్ , ఏవో రవీందర్ , తాసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. 42 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని , పరీక్షల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Read Today's Latest Nizamabad Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

