ఇందల్వాయి, మార్చి 30: ఇందల్వా యి పోలీస్స్టేషన్ పరిధిలోని గన్నారం గ్రామానికి చెందిన కలిగోట అమూల్య (4)పాము కాటుతో గురువారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చాకలి గంగాధర్ కూతురైన అమూల్య ఇంటి ముందు ఆడుకుంటున్నది.
ఆ సమయంలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొన్నది.