కోల్‌కతాలో పీజీ వైద్యవిద్యార్థినిపై లైంగికదాడి, హత్యను నిరసిస్తూ జీజీహెచ్‌లో బుధవారం జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టారు. వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
-ఖలీల్‌వాడి, ఆగస్టు 14
వినాయక్‌నగర్,ఆగస్టు 14: మల్టీజోన్-1 పరిధిలోని ఎనిమిది మంది సీఐలను బదిలీ చేస్తూ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు బోధన్ రూరల్ సర్కిల్‌కు, నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణను బోధన్ టౌన్ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు. వెయిటింగ్లో ఉన్న బి.రఘుపతికి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వోగా పోస్టింగ్ ఇచ్చారు.
బోధన్ రూరల్ సీఐ కె.నరేశ్‌కుమార్‌ను నిజామాబాద్ ట్రాఫిక్ సీఐగా బదిలీ చేశారు. సీసీఆర్బీలో ఉన్న శ్రీనివాస్ రాజ్‌ను నగర సీఐగా నియమించారు. నగర సీఐ బి.నరహరి, టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్యను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని సూచించారు. బోధన్ టౌన్ ఎస్‌హెచ్‌వో వీరయ్యను నిజామాబాద్ సీసీఆర్బీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని సీపీ కల్మేశ్వర్ తెలిపారు.
మల్టీజోన్-1 పరిధిలో బదిలీ అయిన ఎస్సైలు తక్షణమే రిలీవ్ కావాలని బుధవారం సాయంత్రం జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా సమాచారం. దీంతో ఎస్సైలు ఉన్న పళంగా ఠాణాలో మరొకరికి ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. మరోవైపు, బదిలీ అయిన సీఐలు మాత్రం రిలీవ్ కావొద్దని చెప్పినట్లు తెలిసింది.