రామారెడ్డి(సదాశివనగర్), జూలై 7: సదాశివనగర్ మండలం తిమ్మాజీవాడి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి జాజాల గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎర్రం రాజశేఖర్, మల్లయ్య, భిక్షపతి, సంతోష్ స్వామి తదితరులు ఉన్నా రు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. కామారెడ్డిలోని జాజాల నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పడిగెల రాజేశ్వర్రావు, గౌసొద్దీన్, గడీల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.