బోధన్, మే 8: పొతంగల్ మండలంలోని పొతంగల్, కొడిచెర్ల క్వారీల్లో ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడింది. గ్రామస్తుల తీవ్ర నిరసనల నేపథ్యంలో అధికారులు ఆ రెండు క్వారీల్లో ఇసుక తవ్వకాలను శుక్రవారం నుంచి నిలిపివేశారు.
అయితే, ఇదే మండలంలోని కారేగాం, కొడిచెర్ల ఇసుక క్వారీల్లో మాత్రం ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పొతంగల్, కొడిచెర్ల క్వారీల్లో ఇసుక తవ్వకాల నిలిపివేత తాత్కాలికమా లేదా పూర్తిగా ఆ క్వారీలను నిలిపివేశారా అనే విషయమై వేచి చూడాల్సిందే.