బాన్సువాడ : బాన్సువాడ పట్టణానికి చెందిన సందీప్ అనే యువకుడు హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ( Road accident) మృతి చెందడంతో పట్టణంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పట్టణంలోని ఎనిమిదో వార్డుకు చెందిన నక్క సందీప్ కుమార్ (33) అనే యువకుడు హైదరాబాదులో జూనియర్ అసిస్టెంట్‌గా ( Junior Assistant ) విధులు నిర్వహిస్తున్నాడు. మల్కాజిగిరి ( Malkajigiri ) పరిసర ప్రాంతంలో నివాసముంటున్న సందీప్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.