ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను పొగ మంచు కమ్మేసింది. శనివారం తెల్లవారుజాము నుంచే ఊర్లు, పైర్లు శ్వేతవర్ణమైన మంచుతెరలతో కనిపించకుండా పోయాయి.
పల్లెల్లన్నీ పూర్తిగా మంచుగుప్పిట్లోకి చేరిపోయాయి. ఉదయం 9 దాటిన తర్వాత కూడా మంచుతెరలు వీడలేదు. ఎదురుగా ఏమీ కనిపించకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
– ఎల్లారెడ్డి రూరల్/ చందూర్/ కామారెడ్డి, నవంబర్ 2