డిచ్పల్లి, జూలై 14: ధర్మారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభ కళాశాలలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్టీఐలో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపాల్ బి.సంగీత ఆదివారం తెలిపారు. ఇటీవల ప్రకటించిన సీట్ల కేటాయింపులో పి.అభినయ వారణాసిలో బీటెక్ ఫార్మా స్యూటికల్ ఇంజినీరింగ్‌లోని ఐఐటీ (బీహెచ్‌యూ),
బి.వర్ష యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్), ఎన్.కృతజ్ఞ దర్వాడ్లోని ఐఐఐటీలో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీట్లు సాధించారని పేర్కొన్నారు. మరో విడుత కౌన్సిలింగ్, సీట్ల కేటాయింపు మిగిలి ఉన్నదని, దీంతో సీట్ల సంఖ్య పెరిగే అవకాశమున్నదన్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను రీజినల్ కోఆర్డినేటర్ అలివేలు, కళాశాల ప్రిన్సిపాల్ సంగీత, అధ్యాపక బృందం అభినందించారు.