గురువును మించిన దైవం లేదు
హైందవ సంప్రదాయంలో గురువుకు విశిష్ట స్థానం ఉన్నదని, గురువును మించిన దైవం లేదని గురుపరంపరను కొనసాగించాలని ప్రముఖ కవి, ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంతి ఆచార్యులు డాక్టర్ మేడవరం అనంతకుమారశర్మ అన్నారు.
సుభాష్‌నగర్, జూలై 21: హైందవ సంప్రదాయంలో గురువుకు విశిష్ట స్థానం ఉన్నదని, గురువును మించిన దైవం లేదని గురుపరంపరను కొనసాగించాలని ప్రముఖ కవి, ఉస్మానియా యూనివర్సిటీ విశ్రాంతి ఆచార్యులు డాక్టర్ మేడవరం అనంతకుమారశర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని హౌసింగ్‌బోర్డులో శ్రీవిద్యా గణపతి సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో గురుపూర్ణిమ మహోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గణపతి అశోకశర్మ వారి గురువైన డాక్టర్ మేడవరం అనంతకుమారశర్మను ఘనంగా సత్కరించారు.
వేడుకలో భాగంగా మేడవరం రామస్వామి శాస్త్రి, శాప గంగాధర్, చిప్పల లక్ష్మీకాంత్‌శర్మ, వీపీ చందన్రావు, జిమ్మగారి ఉపేంద్రశర్మ, ఒరుగంటి విఠలాచార్య, కప్పకంటి సత్యానంద శర్మ, డాక్టర్ గోపీకృష్ణ, చాడశ్రీ కరుణ కృష్ణరావు, చిత్కల లక్ష్మీకాంత్ శర్మ, చిత్కల శ్రీనివాస్ శర్మ, డా. బి. స్వప్నను జీవన సాఫల్య పురస్కారాలతో సన్మానించారు. కాసర్ల నరేశ్‌రావు, శ్రీకాంత్, రాఘవాచార్య, తల్లవఝుల మహేశ్‌బాబు, అయాచితం నాగరాజుశర్మ, సముద్రాల రాములు, సాయిప్రసాద్‌కు కవిపండిత కళా సత్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా గురుపౌర్ణిమ ప్రాముఖ్యతపై వక్తలు ప్రసంగించారు.అనంతరం కాళేశ్వర శతకాన్ని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

