నస్రుల్లాబాద్ : కామారెడ్డి జిల్లాలో మహా శివరాత్రి ( Maha Shivaratri ) ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నస్రుల్లాబాద్ మండలంలోని దుర్గి గ్రామ శివారులో గల సోమలింగేశ్వర ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి 9Pocharam Surender Reddy ) దంపతులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. గురువారం పోచారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పండుగ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుద్దీపాలలు, పూలతో అందంగా అలంకరించారు.