Nizamabad | కంఠేశ్వర్, మే 25 : సికింద్రాబాద్ లోని జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్ లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 10వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్-2025 రాష్ట్రస్థాయి స్వి మ్మింగ్ పోటీలలో నిజామాబాద్ జిల్లా క్రీడాకారిణి మిట్టపల్లి రిత్విక సీనియర్ నేషనల్ స్విమ్మింగ్ పోటీల విభాగంలో పాల్గొని ఉత్తమమైన ప్రతిభ కనబరిచి 3 బంగారు(Gold)పథకాలు, సాధించింది.
50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ లో 100 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ లో 200 మీటర్ల బెస్ట్ స్ట్రోక్ లో బంగారు పతకం సాధించి జూన్ నెల 22 నుంచి 26 వరకు ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ లో జరుగు 78 వ నేషనల్ అక్విటిక్ ఛాంపియన్షిప్ -2025 జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ రాష్ట్ర తరపున ఎన్నికైంది . ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో 3 బంగారు పథకాలు సాధించి సీనియర్ నేషనల్ 78 వ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన మిట్టపల్లి రిత్వికను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ,తెలంగాణ రాష్ట్ర సిమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి ఉమేష్ , ఉపాధ్యక్షులు జి.మైపాల్ రెడ్డి, జిల్లా స్విమ్మింగ్ అధ్యక్షులు గడిల శ్రీరాములు, కార్యవర్గ సభ్యులు వేణుగోపాల్, శ్యాంసుందర్ రెడ్డి, కైసర్, కర్ణాటక శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ముత్యాల శ్రీనివాస్ తదితరులు అభినందనలు తెలిపారు.