Ji Ram Ji Act | కంటేశ్వర్, జనవరి 9 : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకోవచ్చిన జీరామ్జీ చట్టాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ-2005 చట్టాన్ని కొనసాగించాలని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఘనపూర్ పాలక వర్గ సభ్యులు తీర్మానించారు. ఈ మేరకు ఘనపూర్ గ్రామపంచాయతీ పాలక వర్గం సర్పంచ్ కర్దురం రవి కిరణ్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో గ్రామ సమస్యలు చర్చించడంతో పాటు వాసరి సాయినాథ్ ప్రవేశపెట్టిన ఉపాధి కూలీలకు నష్టదాయకమైన జీ రామ్ జీ చట్టాన్ని రద్దుపరిచి పాత చట్టాన్ని 2005 కొనసాగించాలనే ప్రతిపాదనపై చర్చించారు. కాగా అందులో కొంతమంది వార్డు సభ్యులు వ్యతిరేకించినా మెజార్టీ సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపసర్పంచ్ షేక్ బాబాఖాదర్, కారోబార్, వార్డ్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.