అంగరంగ వైభవంగా కొనసాగిన గణేశ్ శోభాయాత్ర

ఇందూరుః నిజామబాద్ నగరంలోని సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షులు బంటు గణేశ్ ఆధ్వర్యంలో గణేశ్ శోభాయాత్రను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ నీతూకిరణ్, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, మాజీ మేయర్ సంజయ్, స్థానిక కార్పొరేటర్ జెండా ఊపి ప్రారంభించారు. నవరాత్రులు పూజలందుకున్న గణేశ్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతికి హారతినిచ్చి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అనంతరం చతుర్థిని పురస్కరించుకుని శోభాయాత్రను డప్పు,వాయిద్యాలు. ఎడ్ల జతలు రథాన్ని లాగాయి. రథయాత్ర దుబ్బ చౌరస్తా నుంచి ప్రారంభం కాగా, ప్రభాత్ థియేటర్, లలిత మహాల్, రైల్వేగేటు, గాంధీ గంజ్, 1వ టౌన్, గాంధీచౌక్, నెహ్రూపార్కు, పవన్ థియేటర్ రస్తా, బర్కత్‌పుర, గురుద్వారాచౌరస్తా, పెద్దబజార్చౌరస్తా, గోల్హనుమాన్, పాటిగల్లీ, పూలాంగ్ రస్తా, వినాయక్‌నగర్ వినాయకుల బావిలో నిమజ్జనం చేశారు.

దారిపొడవున ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ట్రాఫిక్ సీఐ చందర్‌రాథోడ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ను పోలీసులు మళ్లించారు. రథయాత్ర కొనసాగే మార్గాలలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వినాయక్‌నగర్ ప్రాంతంలో గల గణపతి నిమజ్జన బావిలో విసర్జించడానికి గణనాథుల ప్రతిమలను తీసుకురావడంతో వినాయక్‌నగర్ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. మున్సిపల్ సిబ్బంది బారికేడ్లు నిర్మించారు. ఈ శోభాయాత్రలో నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు, కుల సంఘాల సభ్యులు యువకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

