కస్తూర్బా విద్యార్ధులు.. క్రీడల్లో మెరికలు
గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి శభాష్ అనిపించుకుంటున్నారు.
- రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న గాంధారి కేజీబీవీ విద్యార్థులు
- స్కౌట్స్ అండ్ గైడ్స్లోనూ ప్రతిభ
గాంధారి, అక్టోబర్ 11: గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి శభాష్ అనిపించుకుంటున్నారు. మరోవైపు క్రమశిక్షణకు మారుపేరైన స్కౌట్స్ అండ్ గైడ్స్లోనూ జాతీయస్థాయిలో పాల్గొని పతకాలను సాధిస్తున్నారు. పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినులు అథ్లెటిక్స్, షూ టింగ్ బాల్ పోటీల్లో అందరి ప్రశంసలు పొందుతున్నారు.
విద్యార్థులు సాధించిన పతకాలు..
గాంధారి కస్తూర్బా పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. వీ సరోజ గతేడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి అండర్-16 షూటింగ్‌బాల్ పోటీల్లో ద్వితీయస్థానం సాధించింది. ఈ ఏడాది జనవరిలో బిహార్‌లో జరిగిన అథ్లెటిక్ పోటీల్లో కే సోనిక ప్రతిభ కనబర్చి పతకం సాధించింది. జనవరిలో రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించిన స్కౌట్స్ అండ్ గైడ్స్ పోటీల్లో ఎన్ వెన్నెల, ఆర్. పూజ పాల్గొని బహుమతులను గెలుచుకున్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్న గాంధారి కేజీబీవీ క్రీడాకారులు 13 విభాగాల్లో బహుమతులను సాధించారు. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబర్చి పతకాలను సాధించిన కే స్వప్న (జావెలిన్ త్రో), స్రవంతి (షార్ట్‌పుట్), కుర్మావతి (లాంగ్‌జంప్) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీఎం కప్ మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో పతకాలను సాధించారు.
జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణించడం సంతోషంగా ఉంది..
మా పాఠశాల విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి పతకాలను సాధించడం సంతోషంగా ఉంది. విద్యార్థులు క్రీడలతోపాటు స్కౌట్స్ అండ్ గైడ్స్లోనూ ఉత్సాహంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో క్రీడాకారులు 13 బహుమతులను సాధించడం గర్వంగా ఉంది.
-శిల్ప, ప్రిన్సిపాల్, కేజీబీవీ, గాంధారి
ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం..
పాఠశాలకు చెందిన విద్యార్థులకు క్రమశిక్షణతోపాటు, క్రీడల్లో రాణించేలా ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రతిరోజూ శిక్షణ ఇస్తున్నాం. అందుకే జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నాం. ఇందులో స్టాఫ్, ప్రభుత్వ ప్రోత్సాహం కూడా ఉన్నది.
-సవిత, పీఈటీ, గాంధారి కేజీబీవీ
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

