మాచారెడ్డి, ఏప్రిల్ 20: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. గజ్యానాయక్‌తండా ఎక్స్ రోడ్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మాచారెడ్డి మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి మూడు వేల మంది కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఇందుకోసం తగిన వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్.. జీవితంలో మళ్లీ అధికారంలోకి రాదన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. దీంతో కార్మికులు మే 6న సమ్మె చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో సంతోషంగా ఉన్న రైతులు.. కాంగ్రెస్ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు గంప గోవర్ధన్ తెలిపారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో కలిసి సహపంక్తి భోజనం ఉంటుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్య పడొద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారని తెలిపారు.
పార్టీ అధికారం కోల్పోవడంతో పలువురు అన్ని పదవులు అనుభవించి, బీఆర్ఎస్ను వీడిపోయారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి పార్టీలోకి తీసుకోబోమని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు పగడాల బాల్‌చంద్రం, మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, పార్టీ మండల ప్రధా న కార్యదర్శి రాజాగౌడ్, నాయకులు హంజీనాయక్, బూస శ్రీను, తోకల కిషన్, గైని శ్రీనివాస్‌గౌడ్, లస్కర్‌నాయక్, శ్రీకాంత్‌రెడ్డి, కూచని శేఖర్, పైడాకుల రాములు, చల్లా కృష్ణారెడ్డి, భూక్యా భాస్కర్, సలేంద్రి శ్రీశైలం, దువ్వాక లక్ష్మీనర్సింహులు తదితరులు పాల్గొన్నారు.