ఉచిత శిక్షణ.. ఉపాధికి రక్షణ
ఆధునిక కాలంలో ఎంబ్రాయిడరీ, టైలరింగ్ వృత్తికి మంచి ఆదరణ లభిస్తున్నది. రోజురోజుకూ వివిధ రకాల దుస్తులు విపణిలోకి వస్తున్నాయి. దీంతో ఆ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే తరహా కోటగిరి మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో ఏఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ- హైదరాబాద్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ శిక్షణ, అభయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్, వావ్ విలేజెస్ ఆధ్వర్యంలో మగ్గం శిక్షణ నిర్వహిస్తున్నారు.
- మహిళలు, యువతుల ధీమా
- స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ
- ఎంబ్రాయిడరీ, టైలరింగ్పై మహిళల ఆసక్తి
- నేడు సర్టిఫికెట్ల ప్రదానం
కోటగిరి, ఆగస్టు 17: ఆధునిక కాలంలో ఎంబ్రాయిడరీ, టైలరింగ్ వృత్తికి మంచి ఆదరణ లభిస్తున్నది. రోజురోజుకూ వివిధ రకాల దుస్తులు విపణిలోకి వస్తున్నాయి. దీంతో ఆ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పలు స్వచ్ఛంద సంస్థలు గ్రామాల్లో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే తరహా కోటగిరి మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో ఏఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ- హైదరాబాద్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్ శిక్షణ, అభయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్, వావ్ విలేజెస్ ఆధ్వర్యంలో మగ్గం శిక్షణ నిర్వహిస్తున్నారు. ఇటీవల దివ్యాంగుల కల్యాణ వేదిక సంస్థ హైదరాబాద్, గోల్కొండ క్రాప్ట్ సంస్థ హైదరాబాద్, అభయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్, వావ్ విలేజెస్ సంస్థ.. ఇలా పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఉచిత శిక్షణ అందిస్తూ మహిళలకు ఉపాధి మార్గం చూపుతున్నారు. ఉచిత శిక్షణ అవకాశం కల్పించడంతో మహిళలు, యువతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఎంబ్రాయిడరీతో ఉపాధి..
రోజురోజుకూ ఫ్యాషన్ డిజైన్ కొత్త పుంతలు తొక్కుతున్నది. దీంతో మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో స్వచ్ఛంద సంస్థలు ఎంబ్రాయిడరీ శిక్షణ ఇస్తున్నాయి. కోటగిరి మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో 40 మంది మహిళలకు 45 రోజుల పాటు ఎంబ్రాయిడరీ(మగ్గం) శిక్షణ ఇచ్చా రు. ఇలా ఇప్పటి వరకు ఐదు స్వచ్ఛంద సం స్థల ద్వారా 250 నుంచి 300 మందికి శిక్షణ ఇచ్చారు. తమ కాళ్ల మీద తాము నిలబడొచ్చనే ఆలోచనతో మహిళలు సైతం ఉత్సాహంగా వచ్చి శిక్షణ పొందుతున్నారు. సంస్థ లు సర్టిఫికెట్స్ అందజేసి, అవసరమైతే శిక్షణ పొందిన వారికి చేయూతనందిస్తామని భరో సా కల్పిస్తున్నాయి. ఇలాంటి శిక్షణతో భవిష్యత్తులో ఉపాధి పొందుతామని మహిళలు, యువతులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
సద్వినియోగం చేసుకుంటున్నారు..
మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నా, జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ముందుకు వెళ్లాలన్నా ఆర్థిక ఎదుగుదల ఎంతో అవసరం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యం ఉంటేనే నెగ్గుకురాగలరు. వారు ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ఏఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో గతంలో మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం.
-సునీత, ఏఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు, హైదరాబాద్
చాలా సంతోషంగా ఉంది..
నేను ఎంబ్రాయిడరీ కోర్సు నేర్చుకుంటున్నాను. మా శిక్షకురాలు నాగరాణి చాలా బాగా నేర్పిస్తున్నారు. మంచి ఎంబ్రాయిడరీగా రాణించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. వావ్ విలేజెస్ సంస్థ వారు ఉచితంగా శిక్షణ అందించడం సంతోషంగా ఉన్నది.
-కస్తూరి, ఎత్తొండ, కోటగిరి మండలం
ఉపాధికి మంచి మార్గం..
చదువుతోపాటు ఉపాధికి మార్గం ఎంబ్రాయిడరీ, కుట్టుమిషన్ అవసరమని నమ్మాను. ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడంతో దరఖాస్తు చేసుకున్నాను. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాను. శిక్షణ పూర్తి చేసుకొని ఉపాధి పొందడంతోపాటు మరికొంత మందికి స్వయం ఉపాధి పొందడానికి నావంతు కృషి చేస్తాను.
– ఆశ్విని, కోటగిరి
చాలా అవకాశాలున్నాయి..
ఎంబ్రాయిడరీ (మగ్గం), టైలరింగ్ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని యంత్రా లు, మరెన్నో ఆకృతులు వచ్చినా చేతికుట్టు పనికి డిమాండ్ తగ్గలేదు. సరికొత్త డిజైన్లకు అనుగుణంగా మహిళలు తమ దుస్తులు కుట్టించుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది. పలు గ్రామాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చా. ఒకప్పుడు గృహిణిగా ఉన్న నేను ఈ శిక్షణతో సంపాదించే స్థాయికి ఎదిగా.
– నాగరాణి,ట్రైనర్, బోధన్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

