Pothangal | పోతంగల్, నవంబర్ 26 : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు మండలంలో బుధవారం క్లస్టర్ లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో చందర్ తెలిపారు. మండలంలో 20 గ్రామపంచాయతీలు ఉండగా ఇందుకు గాను ఐదు నామినేషన్ క్లస్టర్ల ఏర్పాటు చేసినట్లు వివరించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
1) దోమలెడ్గి క్లస్టర్: పీఎస్ఆర్ నగర్, టాక్లి, దోమలెడ్గి. సోంపూర్
2) కొల్లూరు క్లస్టర్: సుంకిని, కొల్లూరు, హెగ్డోలి, బాకర ఫారం.
3) హంగర్గ ఫారం క్లస్టర్ : తిరుమల పూర్, చేతన్ నగర్, హంగర్గ ఫారం, కారెగం.
4) కల్లూర్ క్లస్టర్: జల్లాపల్లి, జల్లాపల్లి విలేజ్, జల్లాపల్లి ఫారం, జల్లాపల్లి తాండ, కల్లూర్.
5) పోతంగల్ క్లస్టర్ : పోతంగల్, కొడిచర్ల, హంగర్గ
ఈ క్లస్టర్ లలో ఆయా గ్రామ పంచాయతీల నుండి సర్పంచులు, వార్డ్ మెంబర్లు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించాలని తెలిపారు.