Pothangal | పోతంగల్, జనవరి 19 : తాగునీటి సమస్య ఉంటే 1916 టోల్ ఫ్రీ నంబర్ కు సంప్రదించాలని ఆర్డబ్య్లూఎస్ డీఈ మున్నీ నాయక్ అన్నారు. పోతంగల్ మండలంలోని గ్రామపంచాయతీలో సోమవారం ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శులతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమావేశమై మాట్లాడారు. వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బోర్లు, ట్యాంకులు మరమ్మతులు ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత అదికారులు సమన్వయంతో పనిచేసి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చందర్, ఎంఈవో శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ధనరాజ్, ఏవో నిశిత, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.