కమ్మర్పల్లి మండలం కోనాసముందర్ గ్రామంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చేపలు విక్రయించారు. చేపలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలకు సంబంధించి చేపలు విక్రయించే ప్రదేశంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. సహకార సంఘం వద్ద చేపలు కొనుగోలు చేసి ప్రజలకు కిలో చేపలు 150 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. చేపలకు సంబంధించిన అన్ని రకాల ఆర్డర్లను తీసుకుంటామని, పచ్చళ్లు కూడా తయారుచేసి ఇస్తామని పేర్కొన్నారు.