మాక్లూర్, జనవరి23: విద్యుత్‌ను ప్రజలు అధికంగా వినియోగించడంతోనే బిల్లులు అధికంగా వస్తున్నాయని, పొదుపుగా వాడుకోవాలని ఎంపీపీ ప్రభాకర్ సూచించారు. మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ట్రాన్స్‌కో ఏఈలు గోపాల్, శ్రీనివాస్ సభలో మాట్లాడుతుండగా మదన్‌పల్లి సర్పంచ్ శంకర్‌గౌడ్, శేఖర్, వెంకటేశ్వర్రావు అడ్డుకున్నారు. ఇండ్ల వినియోగదారులకు అదనపు విద్యుత్ బిల్లులు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఏసీడీ పేరుతో అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ విద్యుత్ అధికంగా వినియోగించడంతోనే బిల్లులు వస్తున్నాయని, పొదుపుగా వాడాలని సూచించారు. తహసీల్దార్ శంకర్ మాట్లాడుతూ గ్రామాల్లో రేషన్ సరుకుల పంపిణీ సజావుగా సాగుతోందన్నారు. వేలి ముద్రలు రాకపోవడంతో బియ్యం ఇవ్వడంలేదని ఎంపీటీసీ వెంకటేశ్వర్రావు ప్రశ్నించారు. బయోమెట్రిక్‌తో ఇబ్బందులు ఇస్తున్నాయని తహసీల్దార్ తెలిపారు. 112 రోజులు కంటి వెలుగు ప్రోగ్రాం కొనసాగుతుందని సీహెచ్‌వో ఆనంద్ తెలిపారు. వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీడీవో జైక్రాంతి, ఏవో పద్మ, ఎక్సైజ్ ఎస్సై మల్లేశ్ పశువైద్యాధికారి కిరణ్దేశ్పాండే, పీహెచ్సీ వైద్యాధికారి ఆనంద్, పీఆర్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో ఓంకార్, ఏపీఎం అనిల్, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
‘ఎంపీటీసీలను అగౌరవ పర్చడం సరికాదు’
ఎంపీటీసీలను అగౌరవ పర్చడం సరికాదని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మదన్‌పల్లి ఎంపీటీసీ ఒడ్డెన్న అన్నారు. మాదాపూర్‌లో ఎంపీటీసీలు విలేకరులతో మాట్లాడారు. మండల సర్వసభ్య సమావేశానికి సంబంధించిన ఎజెండాపత్రాన్ని ఆలస్యంగా పంపడంపై నిరసన వ్యక్తం చేశారు. తాము చేసిన పనులకు బిల్లులు అందడం లేదని అన్నారు. ఎంపీపీ తీరుపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. సమావేశంలో ఎంపీటీసీలు లలితా, మీరాబాయి, లక్ష్మి, పురుషోత్తంరావు, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.