Duty meet | వినాయక్ నగర్, జూన్ 20 : పోలీసు సిబ్బంది విధినిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణా రాష్ట్రంలో రెండో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేటులో వివిధ రంగాలలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి ఏసీపీ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వేస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయన్నారు.
పనిలో పోటీతత్వం అలవాటుపడుతుందని, సైంటిఫిక్ ఇన్వేస్టిగేషన్, ఫింగర్ ప్రింట్ ఇన్వేస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేటులో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలనే అంశం కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య సమక్షంలో సీఐలు, ఎస్సైలు, సిబ్బందికి ఎంపిక పరీక్షలు ప్రారంభించారు.
ఇందులో ఫోరెన్సిక్ సైన్స్ ఫింగర్ ప్రింట్ , లిఫ్టింగ్ ప్యాకింగ్, ఐఓ ఫొటోగ్రఫీ, వీడియోగ్రాఫీల కోసం ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఎస్సై నుండి కానిస్టేబుల్ వరకు వారి అబ్జర్వేషన్ పని తీరును మెరుగుపర్చడం, పరీక్షించడం అబ్జర్వేషన్ పరీక్ష, నిందితులను గుర్తించే పరీక్ష మొదలగునవి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యాక్రమానికి పంపనున్నట్లు తెలిపారు.