పోతంగల్ : పవిత్ర రంజాన్ ( Ramadan ) సందర్భంగా నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారంలో ఆదివారం సామజిక సేవాకర్త ఎంఏ హకీమ్ 120 మంది పేద ముస్లింలకు దుస్తులు ( Clothes ) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హకీమ్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామంలో రంజాన్ మాసంలో పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. 30 మంది పదవతరగతి విద్యార్థుల కోసం ఆల్ ఇన్ పుస్తకాలను అందజేశారు. హకీమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో ఏజాజ్ ఖాన్, షేరు, రాములు, మిర్చీ బాబా, అబిబ్, పాషా, నాజీర్ ఖాన్ తదితరులున్నారు.