 
                                                            Nizamabad | కంటేశ్వర్, అక్టోబర్ 30 : నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ లో జరుగుతున్న సీఏటీసీ వార్షిక శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఏపీ, తెలంగాణ Air Commondore నర్సింగ్ సాయిలని (Narsingh Sailani) సందర్శించారు. ఈ సందర్భంగా క్యాడెట్స్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్సీసీని సరైన వేదికగా ఉపయోగించుకొని సాయుధ దళాలు, జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని సూచించారు.
ప్రస్తుతం యువకులంతా 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి పథంలో ఉంచి NCC క్యాడెట్స్గా తమ వంతు బాధ్యతను నిర్వహించాలని, 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని, అదే వికసిత్ భారత్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ వార్షిక శిక్షణ శిబిరం నవంబర్ 7 వరకు కొనసాగుతుందని, ఇందులో నేర్చుకునేటువంటి విషయాలన్నీ రేపు సర్టిఫికెట్ ఎగ్జామ్స్ లో ఉపయోగించి ఉత్తీర్ణులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అప్సెటింగ్ గ్రూప్ కమాండర్ కల్నల్ కపూర్, క్యాంప్ కమాండెంట్ లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రియజిత్ సుర్, అడామ్ ఆఫీసర్ లెప్టినెంట్ కల్నల్ విష్ణు ప్రసాద్ నాయర్, ఎన్సీసీ అధికారులు సివిల్ స్టాప్, పీఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 
                            