ఖలీల్‌వాడి, సెప్టెంబర్ 6: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర ధరలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సుధాకర్, భూమయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈనెల 30 వరకు రేషన్ లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకోకపోతే రేషన్ కార్డులు రద్దు చేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. రేషన్ కార్డు ఉన్న కూలీలు, కార్మికులు గ్రామాల్లో పనులు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, ఈ-కేవైసీకి సమ యం పెంచాలని కోరారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. నాయకులు ఓమయ్య, అడికె రాజేశ్వర్, బి.రఘురాం, నర్సింగ్‌రావు, సాయిలు, అనిల్, రమేశ్, అంజలి, కవిత, సాయికిరణ్ పాల్గొన్నారు.