నాగిరెడ్డిపేట, ఆగస్టు 24: నాగిరెడ్డిపేట తహసీల్దార్ లక్ష్మణ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ శనివారం విచారణ చేపట్టారు. మండలానికి చెందిన పలువురు రైతులు, ప్రజలు కలిసి తహసీల్ కార్యాలయంలో పైసలిస్తేనే పనులు జరుగుతాయని శుక్రవారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో ప్రభాకర్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. పూర్తి నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. విచారణ కోసం వచ్చిన ఆర్డీవోకు పలువురు రైతులు ఫిర్యాదు చేశారు.