ముప్కాల్/ ఏర్గట్ల, నవంబర్ 16: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుకోకుండా, వెంటనే సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తహసీల్దార్‌కు సూచించారు. మెండోరా మండలానికి చెందిన 35 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులపై ఆదివారం వేల్పూర్‌లోని ఆయన నివాసంలో సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులతోపాటు కొత్తగా మంజూరయ్యే వారికి కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.