కామారెడ్డి, డిసెంబర్ 29 : లోక్ అదాలత్ సందర్భంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కౌంటర్‌ను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్.శ్రీదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పెండింగ్ చలాన్ల డబ్బులు ఇక్కడ సులభంగా, తగ్గింపు ధరలో చెల్లించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు 20శాతం, తోపుడు బండ్లకు పదిశాతం, కార్లు, హెవీ వెహికిల్స్‌కు 40శాతం చెల్లింపు కోసం జీవో జారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజగోపాల్‌గౌడ్, అశోక్, నంద రమేశ్, దామోదర్ రెడ్డి,న్యాయవాదులు సిద్ధరాములు, నర్సింహారెడ్డి, న్యాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు భుజంగరావు, కోర్టు సూపరింటెండెంట్లు వెంకట్ రెడ్డి, శ్రీధర్, చంద్రసేనారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.