ఖలీల్‌వాడి, డిసెంబర్ 16: జిల్లాలో ‘మన ఊరు – మన బడి’ కింద కొనసాగుతున్న పనుల్లో అలసత్వం వహిస్తున్న అధికారులపై కలెక్టర్ నారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల ప్రగతి లో వెనుకంజలో ఉండడంతో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ ఈఈ భూమేశ్, ఎడపల్లి, ఇందల్వా యి ఎంపీడీవోలు గోపాలకృష్ణ, రాములుకు కలెక్టర్ మెమోలు జారీ చేశారు. శుక్రవారం ఆయన వీడి యో కాన్పరెన్స్ ద్వారా మన ఊరు – మన బడి, కంటి వెలుగు, క్రిస్మస్ కానుకల పంపిణీ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మన ఊరు – మన బడి కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమోలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నెలాఖరులోపు పూర్తిచేయాలని ఆదేశించా రు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకే జీ రుణ లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న ఆయా సెక్టార్ల ఏపీఎంలు, సీసీల పనితీరుపైనా అసహనం వ్యక్తం చేశారు. వచ్చేవారం నాటికి 65శాతం మేర లక్ష్యాన్ని చేరుకోవాలని, నెలాఖరు నాటికి నిర్దేశిత లక్ష్యంలో 75 శాతానికి పైగా బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. లక్ష్య సాధనలో వెనుకబడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు ఏర్పాట్లను సమీక్షిస్తూ, పకడ్బందీ ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని నూటికి నూ రు శాతం విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లెప్రకృతి, బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, గడువులోపు వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు.
క్రిస్మస్ వేడుకను పురస్కరించుకుని క్రైస్తవులకు ప్రభుత్వం అందిస్తున్న కానుకల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎమ్మెల్యేలను సంప్రదించి కానుకల పంపిణీ, క్రిస్మస్ విందు నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్పెషల్, ఆఫీసర్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. ఈనెల 22 నాటికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, డీపీవో జయసుధ, మెప్మా పీడీ రాములు, డీఎంహెచ్‌వో సుదర్శనం, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌రావు, సీపీవో రథం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్, డీఏవో తిరుమల ప్రసాద్, కార్మికశాఖ అధికారి యోహాన్ తదితరులు పాల్గొన్నారు.