వేల్పూర్, ఫిబ్రవరి 4: అంతుచిక్కని వైరస్‌తో ఉమ్మడి జిల్లాలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. వారం వ్యవధిలో వేల్పూర్, భీమ్‌గల్ మండలాలతోపాటు బీర్కూర్ మండలంలోని కిష్టాపూర్, చించోలిలో లక్షకు పైగా కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా అంతుచిక్కని వైరస్‌తో కోళ్లు చనిపోతు న్నా .. సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఈ పరిస్థితిపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘పౌల్ట్రీ రైతుకు వైరస్ దెబ్బ’ శీర్షికన ఈ నెల4న కథనం ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. మంగళవారం వేల్పూ ర్ మండలంలోని లక్కోర గ్రామంలో కొట్టాల గోవర్ధన్ కోళ్ల ఫారాన్ని జిల్లా పశువైద్య అధికారి గంగాధరయ్య, అసిస్టెంట్ డైరక్టర్ జియావుద్దీన్,స్థానిక పశువైద్య అధికారి సంతోష్‌రెడ్డి సందర్శించారు. వైరస్‌తో మృతి చెందిన కోళ్లను పరిశీలించి వాటి రక్త నమూనాలను సేకరించి, ల్యాబ్‌కు తరలించారు. వైరస్ ఎప్పటి నుంచి సోకిందని, ఇప్పటి వరకు ఎన్ని కోళ్లు మృతి చెందాయనే విషయాలను నిర్వాహకుడిని అడిగితెలుసుకున్నారు.
పశువైద్యశాలకు వెళ్తే ఖాళీ కుర్చీలే..
మండల పశువైద్యశాల ఉన్నా అక్కడ ఎవరూ అందుబాటులో ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏవైనా ఇబ్బందులు ఏర్పడి హాస్పిటల్‌కు వెళ్తే ఖాళీ కుర్చీ లు దర్శనమిస్తున్నాయని, దీంతో తాము ప్రైవేట్ వైద్యులను సంప్రదించాల్సి వస్తున్న దని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పొతంగల్ మండలంలో 4,600 కోళ్లు మృతి
పొతంగల్, ఫిబ్రవరి 4: మండలంలోని చైతన్నగర్లో ఉన్న కోళ్ల ఫారంలో అంతుచిక్కని వైరస్‌తో కోళ్లు మృత్యువాత పడ్డాయి. సోమ, మంగళవారాల్లో సుమారు 4,600 కు పైగా కోళ్లు మృతి చెందినట్లు కోళ్లఫారం యజమాని జల్లాపల్లి గ్రామానికి చెందిన అజిమిర రవి తెలిపాడు. సుమారు రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయిన కోళ్లను గ్రామ శివారులో పాతి పెట్టినట్లు తెలిపాడు.