పొతంగల్, నవంబర్ 17 : కుక్కల బెడదను అరికట్టాలని కోరుతూ పొతంగల్ మండల కేంద్రంలో చిన్నారులు, గ్రామస్తులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. వీధి కుక్కలు చిన్నా పెద్ద తేడాలేకుండా విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయని, ఒంటరిగా పిల్లలను బయటికి పంపడానికి జంకుతున్నామని వివరించారు.
రాత్రివేళల్లో ఎటు చూసినా గుంపులు గుంపులుగా కుక్కలు వీధుల్లో తిరుగుతూ లేగదూడలపై దాడులు చేస్తున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి కుక్కల బెడదను అరికట్టాలని కోరారు.